# Tags
#తెలంగాణ

నవంబర్ 3 న మాదిగల ధర్మ యుద్ధ మహాసభ

కామారెడ్డి జిల్లా : అక్టోబర్ 29 కామారెడ్డి జిల్లా ప్రతినిధి.

ఈ నెల జిల్లా కేంద్రానికి మందకృష్ణ మాదిగ మాదిగల ధర్మ యుద్ధ మహా సభ అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన రీత్యా తిరిగి నవంబర్ నెల 3 వ తేదీన మందకృష్ణ మాదిగ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ఉంటుందని జిల్లా ఎమ్మార్పీఎస్ మహిళా అధ్యక్షురాలు సత్తిగారి లక్మి పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సభకు ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాలు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సభకు పెద్ద మొత్తంలో మాదిగ, మాదిగ ఉప కులాలు, మాదిగ యువత, మాదిగ విద్యార్థి సంఘం నాయకులు ప్రతి ఒక్కరు వచ్చి జిల్లా వ్యాప్తంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి బట్ట వెంకట రాములు, పి పురుషోత్తం, నాగిరెడ్డిపేట మండల అధ్యక్షుడు తొంట సాయిలు, తదితరులు పాల్గొన్నారు.