ముదుగంటి జితేందర్ రెడ్డి జీవితం ఆధారంగా జితేందర్ రెడ్డి సినిమా ప్రివ్యూ షో సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ

జగిత్యాల :
నక్సల్స్ తూటాలకు బలైన ముదుగంటి జితేందర్ రెడ్డి జీవితం ఆధారంగా జితేందర్ రెడ్డి సినిమా ప్రివ్యూ షో సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ
– పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు

జగిత్యాల ప్రాంతానికి చెందిన నాటి ఏబివిపి నాయకుడు, ప్రముఖ ఆర్ ఎస్ ఎస్ నేత స్వర్గీయ ముదుగంటి మల్లారెడ్డి కుమారుడు, నాలుగు దశాబ్దాల క్రితం నక్సల్స్ తూటాలకు బలైన ముదుగంటి జితేందర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కించిన జితేందర్ రెడ్డి తెలుగు సినిమా ప్రివ్యూ షో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్గీయ జితేందర్ రెడ్డి సోదరుడు, బి జె పి నాయకులు ముడుగంటి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది.ఏబీవీపీ బిజెపి ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు, నాయకులతోపాటు ఆయన బాల్యమిత్రులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.జగిత్యాల పట్టణంలోణి ప్రధాన రహదారుల గుండా నిర్వహించిన ఈ ర్యాలీ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

1980 దశకంలో తీవ్రవాదులను ఎదిరించి జాతీయవాదాన్ని బలంగా చాటిచెప్పి వారి చేతిలోనే అమరుడైన జితేందర్ రెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమాను ఆయన సోదరుడు ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మించారు. ఈనెల 8న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ వ్యూ షో సందర్భంగా జగిత్యాల పట్టణంలో జితేందర్ రెడ్డి అభిమానులు, బిజెపి ఏబీవీపీ కార్యకర్తలు బాణాసంచా పేర్చుతూ  మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *