# Tags

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో తప్పులు లేకుండా చూడాలి::జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ..

(తెలంగాణ రిపోర్టర్ ):-

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా ఎన్యుమరేటర్లు నిబద్ధత, అంకిత భావంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తెలిపారు.సమగ్ర ఇంటింటి కుటుంబ (సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల) సర్వే సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో కొనసాగుతుండగా, మంగళవారం కలెక్టర్ 17వార్డ్, 28వ వార్డ్ లో ఆకస్మికంగా తనిఖీ చేశారు.అధికారులు, సిబ్బంది చేస్తున్న సర్వేను కలెక్టర్ పరిశీలించారు. సర్వేలో భాగంగా తీసుకుంటున్న సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. సమాచారం ఇవ్వడానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని పలు గృహాల వాసులను వివరాలు అడిగి ఆరా తీశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వే ప్రక్రియలో తు.చ. తప్పక ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలన్నారు.సర్వే ప్రక్రియలో ఎన్యుమరేటర్లు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. సర్వేపై ప్రజలకు ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేయాలన్నారు. ప్రజలు ఎలాంటి అపోహాలు పడకుండా ఎన్యుమరేటర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

సర్వేలో ఏ ఒక్క కుటుంబాన్ని కూడా విడిచి పెట్టవద్దని, అన్ని కుటుంబాల వివరాలు సేకరణ సమగ్రంగా సేకరణ చేయాలని ఎన్యూమరేటర్లను ఆదేశించారు. సర్వేను అధికారులు తనిఖీ చేయాలని సూచించారు. ప్రజలు సమాచారాన్ని అందించి సర్వే సిబ్బందికి సహకరించాలని సూచించారు.

తనిఖీలో ఎన్యూమరేటర్లును, సూపర్వైజర్లు ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్వే ఫారాల నమోదును పరిశీలించారు. కోడ్‌లు స్పష్టంగా రాశారా, ఫార్మాట్‌లో ఉన్నాయా లేదా పరిశీలించి ఎలాంటి తప్పులు లేకుండా స్పష్టంగా వ్రాయాలని దిశానిర్దేశం చేశారు.

ఈ పర్యటనలో సిరిసిల్ల ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ లావణ్య, తదితరులు పాల్గొన్నారు.