# Tags
#తెలంగాణ

పదవ తరగతి విద్యార్థులకు గోరుముద్ద

(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజ):

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లికి చెందిన కొండా ఆంజనేయులు గౌడ్ ఆర్థిక సహాయంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాచర్ల గొల్లపల్లి లోని పదవ తరగతి విద్యార్థులకు గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరము డాక్టర్ ఆంజనేయులు ఇలాగే పదవ తరగతి విద్యార్థులకు గోరుముద్దను అందిస్తూ వస్తున్నారు.ఈ విద్యా సంవత్సరం 10వ తరగతిలో విద్యార్థిని విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు .ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మరియు అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ మరియు సభ్యులు మరియు ఉపాధ్యాయ బృందము డాక్టర్ ఆంజనేయులు గౌడ్ ని ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పాక మురళీధర్ మరియు పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.