# Tags
#తెలంగాణ

సీఎం సభను విజయవంతం చేయండి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

(తెలంగాణ రిపోర్టర్):

బుధవారం 20న వేములవాడ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలిరావాలని
ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే, రాజన్న సిరిసిల్ల డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్ పిలుపు నిచ్చారు.
గల్ఫ్ లో మృతి చెందిన కార్మిక కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సహాయం అందించడం.

చేనేత కార్మికుల కోసం యారన్ డిపో మరియు జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రారంభోత్సవం.
126 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం..
మిడ్ మానేర్ భూనిర్వాసితుల కోసం 4,696 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 237 కోట్ల నిధులను మంజూరు చేస్తూ తీసుకున్న నిర్ణయాల పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ బ్లాక్, మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల, విభాగాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు , గత బిఆర్ఎస్ ప్రభుత్వం లో వేములవాడ సిరిసిల్ల ప్రాంత ప్రజల సమస్యలను కష్టాలను గుర్తించకుండా నిర్లక్ష్య వైఖరి వహించి, గడిచిన పదేళ్లలో బిఆర్ఎస్ పాలనలో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మోసం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలు మెచ్చిన ప్రజా పాలన చేస్తున్న కాంగ్రెస్ సర్కారు పట్ల జిల్లా ప్రజల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వేములవాడలో రాజన్న సాక్షిగా నిర్వహించబోయే బహిరంగ సభకు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు హాజరయ్యే విధంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేయాలని పత్రిక ముఖంగా పిలుపు నిచ్చారు…