# Tags
#తెలంగాణ

రైస్ మిల్లులను తనిఖీ చేస్తున్న పొల్యూషన్ అధికారులు

మానకొండూర్ :

మండల కేంద్రంలోని సదాశివపల్లి స్టేజి సమీపంలో ఉన్నటువంటి రైస్ మిల్ యజమాన్యాలు ఇష్టానుసారంగా మిల్లులను నడుపుతున్నారు మిల్లుల చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులు ఎన్నో రకాలుగా అనారోగ్యాలు కు గురవుతున్నారు వారి ఇండ్లలో అనేకమైన దుమ్ము ధూళి రావడంతో ప్రతిరోజు నరకయాతన అనుభవిస్తున్నారు అయినప్పటికీ రైస్ మిల్ ఓనర్లు కు కాలనీ ప్రజలను ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు.
అంతేకాకుండా నేషనల్ హైవే మధ్యలో ఉన్నప్పటికీ హైవేపై ప్రయాణిస్తున్న బాటసారిలకు దుమ్ము ధూళి కండ్ల లో పడటంతో ఎన్నో యాక్సిడెంట్లు జరిగి ఎన్నో ప్రాణాలు పోయినాయి అంటూ కాలనీ ప్రజలు పొల్యూషన్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో రైస్ మిల్లులను పొల్యూషన్ అధికారులు తనిఖీ చేసి రైస్ మిల్ యజమాన్యాలను హెచ్చరించారు.

వారం రోజులలో మిల్లుల నుండి ఎలాంటి పొగ దుమ్ము ధూళి రాకుండా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడకూడదని అన్నారు ఈ కార్యక్రమంలో కాలనీ ప్రజలు నరేష్ కుమార్ కొమురయ్య మహేష్ తిరుపతి సంపత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు