# Tags
#తెలంగాణ

వివేకానంద మినీ స్టేడియంలో జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడా మహోత్సవం-ప్రారంభించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జిల్లా కేంద్రంలో వివేకానంద మినీ స్టేడియంలో జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా మహోత్సవం – ప్రారంభించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

జగిత్యాల

జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో
వచ్చే డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ క్రీడా పోటీలను గురువారం మధ్యాహ్నం 12-30 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…దివ్యంగులు అందరిలా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. సమాజంలో అందరితోపాటూ దివ్యంగులు సమానమేనని, ప్రభుత్వం అందగా ఉంటుందన్నారు.
తాను రాజకీయాలకు రాకముందే రోటరీ క్లబ్, ఆపి స్వచ్ఛంద సంస్థల ఆద్వర్యంలో సేవా కార్యక్రమాలలో పాల్గొన్న విషయం తెలిసిందేనన్నారు. బ్యాటరీ సైకిల్స్,కృత్రిమ కాలు, చేతు అవయవాలు అందజేయటం జరిగిందని వివరించారు.

డబల్ బెడ్ రూం ఇండ్ల లో 5 శాతం దివ్యాంగులకు రిజర్వేషన్ కల్పించి మంజూరు చేయటం జరిగిందనీ…. ఇంకా పొందని దివ్యంగులకు గ్రౌండ్ ఫ్లోర్ లో కేటాయించడం జరుగుతుందన్నారు.ఈ క్రీడలకు సంబందించి  ముగింపు సంబరాల్లో తన వంతుగా విజేతలకు బహుమతులందజేస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యంగుల సంక్షేమ అధికారి డా.నరేష్, కౌన్సిలర్ చుక్క నవీన్,SGF జిల్లా సెక్రటరీ లక్ష్మి రాం నాయక్, మెప్మా  AO శ్రీనివాస్ గౌడ్, DYSO రవి కుమార్, జిల్క బాలల సంరక్షణ అధికారి హరీష్,  రెడ్ క్రాస్  సొసైటీ జిల్లా కమిటీ సభ్యుడు  సిరిసిల్ల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ గొడిసెల గంగాధర్, దివ్యంగ సంఘ నాయకులు లంకదాసరి శ్రీనివాస్, బండి సత్యనారాయణ, అస్గర్ ఖాన్, వ్యక్తిత్వ వికాస  నిపుణుడు అజీజ్, శ్రవణ్, బాబా, సఖి జాన్సన్, విమెన్ ఎంపవర్మెంట్ ప్రతినిధులు అశ్విని, పవిత్ర,  మరియు ప్రభాత్ సింగ్ ఠాగూర్, రంగు మహేష్, రమేష్, ప్రవీణ్ రావు, జంగిలి శశి,చిట్ల మనోహర్,క్రాంతి,మహేష్, జిల్లా ప్రమోటర్స్ చీఫ్ అధ్యక్షులు మలికొండ ప్రవీణ్ పాల్గొన్నారు.