# Tags
#తెలంగాణ

రైతు ఖాతాలలో సన్న వడ్లకు 500రూ.బోనస్ -రైతుల సంబరాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరి సాగు చేసిన రైతు ఖాతాలలో సన్న వడ్లకు 500 రూ. బోనస్ పడటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపు కుంటున్నారు.

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి బస్టాండ్ వద్ద టపాసులు కాల్చి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రైతులు ఆనందం వ్యక్తం చేశారు.