#టెక్ న్యూస్ #Events #Tech #తెలంగాణ

‘బన్యన్ నేషన్’ రూ. 200 కోట్లతో విస్తరణ :మంత్రి శ్రీధర్ బాబు

* మరో 500 మందికి ఉద్యోగావకాశాలు : మంత్రి శ్రీధర్ బాబుతో సంస్థ ప్రతినిధుల సమావేశం

హైదరాబాద్:

ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ పరిశ్రమతో సర్క్యులర్ ఎకానమీకి తోడ్పడుతున్న అంకుర సంస్థ ‘బన్యన్ నేషన్’ తెలంగా ణలో రూ.200 కోట్ల పెట్టుబడితో భారీ విస్తరణ చేపట్టేందుకు ముందు కొచ్చింది. గురువారం సచివాలయంలో సంస్థ ప్రతినిధులు ఐటీ, పరిశ్ర మల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. అనంతరం వారితో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. ‘ప్రస్తుతం పటాన్ చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడలో 15 వేల టన్నుల వార్షిక సామర్థ్యంతో ‘బన్యన్ నేషన్’ రీసైక్లింగ్ పరిశ్రమను నిర్వహిస్తోంది. దీనిని 45 వేల టన్నులకు విస్తరించడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది.

ఇది పూర్తయితే మరో 500 మందికి కొత్తగా ఉద్యోగాలు లభి స్తాయి. రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ ను ఈ సంస్థ యూనిలివర్, టాటా మోటార్స్ లాంటి పెద్ద కంపెనీలకు విక్రయిస్తోంది.

రూ.100 కోట్ల వార్షిక టర్నోవర్ తో లాభాల్లో నడుస్తోంది. కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు కొంత భూమి అడుగుతున్నారు. దీనిపై టీజీఐఐసీ నిర్ణయం తీసుకుంటుంది’ అని మంత్రి వివరించారు.

ఈ సమావేశంలో ఐటీ శాఖ సలహాదారు సాయికృష్ణ, టీజీఐఐసీ సీఈవో మధుసూదన్, బన్యన్ నేషన్ సీఈవో మణి వాజ్పేయీ, సీవోవో రాజకిరణ్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *