#తెలంగాణ #హైదరాబాద్

తెలంగాణ పోలీసులు క్రమశిక్షణకు మారుపేరు : మంత్రి శ్రీధర్ బాబు

సంగారెడ్డి జిల్లా, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(SPF)శిక్షణ కేంద్రం :

తెలంగాణ పోలీసులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు ప్రశంసించారు.

శుక్రవారం సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ స్పెషల్ ప్రొటె క్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) శిక్షణ కేంద్రంలో 225 మంది కాని స్టేబుళ్లు 9 నెలల శిక్షణ పూర్తి చేసుకుని బయటికి వెళ్తున్న సందర్భంగా పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా వారి నుంచి మంత్రి శ్రీధర్ బాబు గౌరవ వందనాన్ని స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, ఐజీ సత్యనారా యణ, శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ మాధవరావు, సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేశ్ కుమార్ తదితరులున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *