# Tags
#తెలంగాణ #సాంస్కృతికం #హైదరాబాద్

బంగారు అంచుతో కూడిన ఆకుపచ్చటి చీర, ఎరుపురంగు జాకెట్, నుదుటన తిలకంతో తెలంగాణ తల్లి…

ఈ నెల 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను మార్చి, తీర్చిదిద్దింది . అయితే ఈ విగ్రహం ఎలా ఉంటుందనే సస్పెన్స్ కు తెరపడి, సచివాలయంలో ప్రతిష్టకు సిద్దమయ్యింది..

బంగారు అంచుతో కూడిన ఆకుపచ్చటి చీర, ఎరుపురంగు జాకెట్, నుదుటన తిలకంతో తెలంగాణ తల్లిని రూపొందించారు. తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో మొక్కజొన్న, వరి, సజ్జ కంకులు ఉన్నాయి. విగ్రహం కింద గద్దెపై బిగించిన పిడికిలిని చిత్రీకరించారు.

తెలంగాణ సగటు గ్రామీణ మహిళను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ తల్లిని రూపొందించినట్లు స్పష్టమవుతుంది.

జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గంగాధర్ ఈ చిత్రానికి రూపకల్పన చేశారు. ప్రముఖ శిల్పి రమణారెడ్డి బృందం కాంస్య విగ్రహాన్ని తయారు చేసింది. 17 అడుగుల ఈ విగ్రహాన్ని ఇప్పటికే సచివాలయ ప్రాంగణానికి తరలించగా, ఆవిష్కరణకు సిద్ధం చేస్తున్నారు.