#తెలంగాణ #జగిత్యాల

ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పల్లె దవాఖానాల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసిన MLA డా. సంజయ్ కుమార్ 

రాయికల్ మండలంలో :

రాయికల్ మండలం బోర్నపల్లి ,ధర్మాజీపేట గ్రామాలలో 20 లక్షల చొప్పున నిధులతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పల్లె దవాఖానాల నిర్మాణాలకు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో  జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…రోగం వచ్చాక చికిత్స కన్నా రోగం రాకుండా జాగ్రత్తలు ముఖ్యం అనీ,సేవ ద్వారానే వైద్యులకు ప్రజల్లో గుర్తింపు వస్తుందన్నారు. సాధారణ ప్రసవాల పట్ల వైద్యులు, ఆశా వర్కర్లు,తల్లి దండ్రులు అవగాహన కల్పించాలన్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ DMHO శ్రీనివాస్, నాయకులు కోల శ్రీనివాస్,రవీందర్ రావు, గన్నె రాజీరెడ్డి , పడిగేల రవీందర్ రెడ్డి, పాదం లత రాజు, మాజీ ఎంపీటీసీ బీర్సావ్,మర్రిపెళ్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ AMC డైరెక్టర్ తిరుపతి గౌడ్, మాజీ మండల కో ఆప్షన్ ముకీద్,ప్రవీణ్ రావు,మల్లారెడ్డి, మదు, తూకారం, మాజీ సర్పంచ్ లు అనిపురం శ్రీనివాస్ ,సమల్ల వేణు,పాల కుర్తి రవి గౌడ్,గంగారం, మాజీ ఉప సర్పంచ్ వెంకటేష్, నాయకులు ఆకుల మల్లేశం,అభిరామ్,సంజీవ్,తిరుపతి నాయక్,చిరంజీవి,DE మిలీంద్,AE ప్రసాద్, డా.సంతోష్, , అధికారులు, వైద్య సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *