#తెలంగాణ #జగిత్యాల

22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి ప్రతిష్టాపనకు ఎమ్మెల్సీ కవిత భూమి పూజ

జగిత్యాల:

ప్రభుత్వ జీవోలను ధిక్కరించి 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి ప్రతిష్టాపనకు దరూర్ కెనాల్ వద్ద  భూమిపూజ చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

ప్రభుత్వ జీవోలను సైతం ధిక్కరించి, 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి ప్రతిష్టాపనకు దరూర్ కెనాల్ వద్ద శనివారం బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భూమిపూజ చేశారు.

ఈ సందర్భంలో ఆమె విలేఖరులతో మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లిని తాము  అంగీకరించే ప్రసక్తే లేదని తెల్చి చెప్పారు.

తెలంగాణ అస్తిత్వం పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడిని గ్రామ గ్రామాన ఎండగడుతామన్నారు.ఉద్యమ తెలంగాణ తల్లినే గ్రామ గ్రామాన ప్రతిష్టించుకుంటామనీ, ప్రభుత్వం గెజిట్ ఇచ్చినా, కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు.మా అందరికీ ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపిన ఉద్యమ తెలంగాణ తల్లినే ఆరాధిస్తామని…

తెలంగాణ తల్లిలోని బతుకమ్మను కాపాడుకుంటాం అని బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *