# Tags
#తెలంగాణ

వీధి కుక్కలు వెంట పడడంతో రోడ్డు పక్కన డ్రైనేజీలో పడిపోయిన బాలుడు-కాపాడిన మున్సిపల్ మహిళా ఉద్యోగి

కరీంనగర్ :(M. Kanakaiah)

కరీంనగర్ లోని డాక్టర్స్ ఏరియా సాయి నగర్ రోడ్ నెంబర్ వన్ లో రోజువారీగా యధావిధిగా సైకిల్ పై స్కూల్ కి వెళ్తున్న విద్యార్థి బబుల్ పై మంగళవారం రోజున ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో విధి కుక్కలు వెంట పడ్డాయి.

దీంతో భయానికి గురైన బబుల్ రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీ లో పడిపోయాడు. ఆ సమయంలో అటువైపు వెళుతున్న మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగి సుహార్ లత, ఆమె కూతురు నిక్షిత విద్యార్థిని చూసి వెంటనే డ్రైనేజీలో దిగి బయట తీశారు.

అనంతరం నిక్షిత, డ్రైనేజీ బురద అంటుకున్న బబుల్ డ్రెస్ విడిపించి, ఆమె ఒంటిపై ఉన్న స్వెట్టర్ ను తొడిగించారు. విద్యార్థి తల్లిదండ్రులు అందుబాటులో లేకపోవడంతో వారి అమ్మమ్మ కు సమాచారం ఇచ్చి వారింట్లో అప్పజెప్పారు. త్రుటిలో తప్పిన ప్రమాదం- అబ్బాయి క్షేమం, అంటూ మున్సిపల్ సిబ్బంది సుహార్ లత వారి కూతురు నిక్షితల ను స్థానికులు ప్రత్యేకంగా ఈ సందర్భంలో అభినందించారు.