#తెలంగాణ

ప్రత్యేకంగా తమకు ఐదు శాతం రిజర్వేషన్ కేటాయించాలి-ఎస్సీ కమిషన్ చైర్మన్ డా.జస్టిస్ షమీం అక్తర్ కు వినతి

హుజురాబాద్ :

మాల మాదిగలతో కలపకుండా సపరేట్గా ఏర్పాటు చేసి ఐదు శాతం రిజర్వేషన్ కేటాయించాలని, వెంటనే ఎస్సి ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు ఆధ్వర్యంలో ఆ సంఘ నాయకులు ఎస్సీ కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీం అక్తర్ కి బుధవారం వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ.. ఎస్సీ ఉప కులాల్లో మేజర్ కులమైన బేడ బుడగ జంగం కులానికి చైర్మన్ పదవి ఇవ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న వారిలో ఇప్పటికీ పూరి గుడిసెలలో నివసిస్తున్న మా బేడ బుడగ జంగా కులానికి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో 30% కేటాయించాలని డిమాండ్ చేశారు.

హైదరాబాదులో బేడ బుడగ జంగా కులానికి వెయ్యి గజాల స్థలం ఇచ్చి కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇవ్వాలని కోరారు. ఈరోజు ఈ మేరకు ఎస్సీ కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీం అక్తర్ కి మరియు వారి బృందానికి బేడ బుడగ జంగం జన సంఘం తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు, గౌరవ అధ్యక్షులు తుర్పాటి లింగయ్య, కార్యవర్గ సభ్యులు రేవెల్లి వెంకటేష్, కార్యవర్గ సభ్యులు చింతల అంజి, కుల పెద్ద మనుషులు నూనె మల్లయ్య, సిరిగిరి రాజయ్య, సిరిగిరి వెంకటేష్, భూతం రవీందర్, రమేష్, భూతం అంజి, తురుపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *