#తెలంగాణ

కేటీఆర్ పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే తొలగించాలి…ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి-ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్

హుజురాబాద్ 🙁 M.Kanakaiah):

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే తొలగించాలని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పట్టణంలోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై గొంతెత్తిన కేటీఆర్ పై కక్షగట్టి కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నామని ఆయన తెలిపారు.

ప్రజా సమస్యలపై కొట్లాడే వారిపై కుట్ర పూర్వకంగా కేసులు పెట్టడం ప్రభుత్యానికి సంమజసం కాదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రైతులను రాజులను చేశాడని ఇప్పటి ప్రభుత్వం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తుందన్నారు.

లగచర్ల రైతులకు సంకెళ్లు వేయడం సోచనీయమన్నారు. లగచర్ల రైతులు భూములు ఇవ్వమని చెప్పినందుకే కక్షపూరితంగా కేసులు పెట్టి 35 రోజులపాటు జైల్లో పెట్టి ప్రభుత్వం వేదిస్తుందన్నారు.

గురుకులాల్లో విషపూరిత ఆహారం వల్ల నిత్యం ఎక్కడో ఒకచోట విద్యార్థులు బలవుతున్నా, ప్రభుత్వం పట్టనట్టుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ఏడాది పూర్తయిన నెరవేర్చకుండా సంబరాలు ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రజాపాలన సంబరాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ ను అక్రమంగా అరెస్టు చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలను ఒక్కరిని కూడా తిరగనియ్యమని శ్రీనివాస్ హెచ్చరించారు.

ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ గండె రాధిక శ్రీనివాస్, కౌన్సిపర్లు మారపెల్లి సుశీల, కేసిరెడ్డి లావణ్య, ముక్క రమేష్, మక్కపల్లి కుమార్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంగెం ఐలయ్య, బిఆర్ఎస్ నాయకులు చింత శ్రీనివాస్, తొగరు శివ, సంపంగి రాజేందర్, కుమార్ యాదవ్, రమేష్ యాదవ్, దిల్ శ్రీనివాస్, మోరే మధు, రేణుక తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *