# Tags
#Blog

ఏం జరిగింది, ఎందుకు చనిపోయారు… ఏంటా మిస్టరీ….!

కామారెడ్డి జిల్లాలో ఎస్సై, మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ముగ్గురు రెండు రోజుల క్రితం అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో శవాలుగా తేలడం పోలీస్ శాఖ లోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది!…ఎం జరిగింది, ఎందుకు చనిపోయారు… ఏంటా మిస్టరీ అని క్యూరియాసిటీ గా ఎదురు చూసారు. ముఖ్యం గా కామారెడ్డి జిల్లా వాసులు…

ముగ్గురూ చిన్న వయసు వారే.. ఎంతో భవిష్యత్ ఉండింది. అర్ధంతరంగా తనువు చాలించారు!ఎస్సై గురించి వాకబు చేస్తే తనో మధ్య తరగతి నుండి వచ్చిన వాడని తెలింది… కష్టపడి చదివి ఎస్సై ఉద్యోగం సాధించిండు…. ఇంట్లో తల్లిదండ్రుల ఆనందానికి అవధూల్లేవు… ఇంతలో వివాహం… భార్య…. బాబు పుట్టడం..ఉద్యోగం లోను మంచిపేరు, డబ్బు… హాయిగా జీవితం సాగిపోతున్న దశలో ఇలాంటి దుర్గటన…. కానిస్టేబుల్ అమ్మాయి కూడా మధ్య తరగతి జీవనమే అని తెలిసింది… కష్టపడి ఉద్యోగం సాధించింది. భర్త తో విడాకులు తీసుకున్నట్లు వినపడుతోంది.. కంప్యూటర్ ఆపరేటర్ గురించి తెలియలేదు.. అవివాహితుడు అని సమాచారం…

కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది…ఒక సిఐ ని విచారణ అధికారిగా వేశారట…పోలీస్, పత్రిక ల కధనం ప్రకారం మొదలు ఇద్దరి శవాలు తర్వాత ఎస్సై శవాన్ని వెలికితేశారు… అక్కడ కారు, సెల్ ఫోన్లు ఉన్నట్టు గుర్తించారు… ముగ్గురు ఒకే వాహనం లో వెళ్లినట్టు తెలింది…చెరువు కట్ట మీదముందుగా గొడవ పడ్డట్టు ఆనవాళ్లు ఉన్నాయని కధానలు వచ్చాయి…

ఆవేశంతో ముందుగా మహిళా కానిస్టేబుల్ దూకిందని ఆమెను కాపాడే ప్రయత్నం లో ఎస్సై, కంప్యూటర్ ఆపరేటర్ కూడా నీటిలో మునిగి చనిపోయారని సమాచారం… (ఎస్సై కి ఈత రాదని తెలిసింది )నేడో రేపో అన్ని విషయాలు బయటకు వస్తాయి?…. కొన్ని విషయాలు బయటకు రావు!… ప్రజలకు అవసరం లేదు!. వలపు వల ఘటన లు పోలీస్ శాఖ లోనే ఎక్కువ గాఎందుకు జరుగుతున్నాయి.? ఇటీవల నాలుగైదు సంఘటన లు మనం విన్నాము చూసాము కూడా…..

ఇటీవలే ఒక ఎస్సై ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. వేరే శాఖ లో, సమాజం లో జరగడం లేదని కాదు…ఎంతో కష్టాలు పడీ ఉద్యోగం సంపాదించుకుంటారు..పేరు తెచ్చుకుంటారు….. అన్నీ సక్రమంగా జరిగి పోతున్న క్రమంలో ఇలాంటి చిన్న చిన్న ప్రలోభాలకు లోనై జీవితాన్ని అర్ధంతరంగా ముగిస్తారు…

ఎస్సై కుటుంబాన్నే తీసుకుందాం… చిన్న బాబు, భార్య.. వృద్ధాప్యం లో ఉన్న తల్లిదండ్రులు వీళ్ళను ఎవరు ఓదారుస్తారు… డబ్బులు ఎంత వరకు స్వాంతన ఇస్తాయి….

పోలీస్ శాఖ కూడా ఈ ఘటన ను సీరియస్ గా పరిగణలోకి తీసుకుందని వార్త వచ్చింది…. సమాజానికి ఆదర్శనంగా ఉండాల్సిన శాఖ లోనే ఇలాంటి కేసులు వారానికొకటి వెలుగులోకి రావడం నిజంగా బాధాకరం… చిన్న చిన్న గొడవలు, ఆవేశలు ముగ్గురి కుటుంబాల్లో విషాదం నింపింది….

-Nellutla Ramana