# Tags
#తెలంగాణ

ఇటిక్యాలలో సంక్రాంతి ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు

రాయికల్ : S.Shyamsunder :

మండలంలోని ఇటిక్యాల గ్రామంలో మకర సంక్రాంతి సందర్భంగా గ్రామ సేవా సమితి ఆధ్వర్యంలో సాయిబాబా మందిర ఆవరణలో ముగ్గుల పోటీలు మరియు గాలిపటాల పోటీలను ఘనంగా నిర్వహించారు..

చిన్నారులంతా అందమైన ముగ్గులు వేస్తూ, పోటా పోటీగా నిలిచారు. అనంతరం గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు..

ఈ కార్యక్రమానికి తమ వంతు కృషిచేసిన చందనగిరి మనోహర్, సత్య హాస్పిటల్ డాక్టర్ ఉదయ్ కుమార్, కాటేపల్లి గంగారెడ్డి వారి మనుమరాల్లను శాలవాలతో ఘనంగా సన్మానించారు.

గ్రామ సేవా సమితి అధ్యక్షులు నల్ల గంగారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ…..మొట్టమొదటి నుండి గ్రామం ఐకమత్యంగా ఉంటుందని, ప్రతి పండుగలను కలిసి మెలిసి జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు..

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సామల్ల లావణ్య వేణు, ఎంపీటీసీ కొమ్ముల రాధఆదిరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ చంద్రశేఖర్, నాయకులు నారాయణ గౌడ్, కొల్లూరు వేణు, నీరటి శ్రీనివాస్, అనుపురం చిన్న లింబాద్రి, కనపర్తి శ్రీనివాస్, సామల్ల నవీన్, మెడపట్ల మహేష్, నరేష్, విప్పర్ గంగాధర్, మంత్రి అరవింద్ గౌడ్, గ్రామ సేవా సమితి సభ్యులు, గ్రామ పెద్దలు మహిళలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు…