# Tags
#తెలంగాణ

మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫెరియా fiesta  పేరుతో ప్రదర్శన

కరీంనగర్ : M. Kanakaiah :

కరీంనగర్  ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఫెరియా fiesta  పేరుతో ప్రిన్సిపాల్ వరలక్ష్మి అధ్యక్షతన ఎగ్జిబిషన్ నిర్వహించారు.

మంగళవారం నిర్వహించిన ఈ ఎగ్జిబిషన్ కు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మరియు అడిషనల్ కలెక్టర్ ప్రపూర్ దేశాయ్ హాజరై ప్రారంభించారు.

ఈ సందర్బంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ ప్రదర్శనలను వారు తిలకించి, విద్యార్థులను అభినందించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్థానికంగా అన్ని వసతులు, సదుపాయాలతో అనుభవమున్న అధ్యాపకులు గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరి తమ ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని విద్యార్థులకు సూచించారు. కేవలం విద్యను అభ్యసించడం కాకుండా సామాజిక కార్యక్రమాలైన భేటీ బచావో – బేటి పడావో,  రహదారి భద్రత వంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని సూచించారు.

అడిషనల్ కలెక్టర్ ప్రఫూల్ దేశాయ్ మాట్లాడుతూ, కళాశాలలో గల అన్ని సౌకర్యాలు వినియోగంలో తెచ్చుకోవాలని అందుకు తమవంతు సహాయ సహకారాలు అందజేస్తామని అన్నారు  ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.