# Tags
#తెలంగాణ #జగిత్యాల

బాలికల పాఠశాలలో ఘనంగా ఆంగ్ల భాషా దినోత్సవం

రాయికల్ : ఎస్. శ్యామసుందర్

పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం రోజున సరోజినీ నాయుడు పుట్టినరోజు సందర్భంగా జాతీయ ఆంగ్లభాష దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.

ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు ఆంగ్లంలో ఉపన్యాస వ్యాసరచన స్టోరీ టెల్లింగ్ చిత్రలేఖనం వంటి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆంగ్ల ఉపాధ్యాయులు మండలోజు రవీందర్ మరియు సామల గంగాధర్ మాట్లాడుతూ… సరోజినీ నాయుడు గొప్ప కవిత్రి మరియు స్వతంత్ర సమరయోధురాలు, ఆమెకు చిన్నప్పటినుండే ఆంగ్ల పద్యాలు కవితలు రచనలు ఎన్నో చేశారన్నారు.13 సంవత్సరాల నుండే కవితలు రాయడం అలవర్చుకున్నారనీ, స్వతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్నారని వివరించారు.

స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ గవర్నర్ కూడా చేశారని వారు చెప్పడం జరిగింది కాబట్టి పిల్లలు ఇంగ్లీష్ భాష పట్ల మక్కువ పెంచుకోవాలని ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం ఉన్నట్లయితే భవిష్యత్తులో పోటీపరీక్షలలో నెగ్గవచ్చని వారు తెలిపారు.

ఆంగ్లంలో పట్టు ఉన్నట్లయితే ప్రపంచంలో ఆయా దేశాలలోని సంస్కృతులను సాంప్రదాయాలను తెలుసుకోవచ్చు అని ప్రపంచంలోనే గుర్తింపు పొందిన భాషగా ఆంగ్లభాష అని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు పొన్నం రమేష్, మల్లేశం, సత్యనారాయణ, గంగ, జమున, అలీ, రాజా, తిరుమల, వనిత శివానందం గంగాధర్ శ్రీకాంత్ యాస్మిన్ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు