# Tags
#తెలంగాణ

కన్నుల పండువగా భీమేశ్వరస్వామి రథోత్సవం

ముగిసిన జాతర ఉత్సవాలు :

రాయికల్ : ఎస్. శ్యామసుందర్

రాయికల్ పట్టణంలోని ప్రాచీన చరిత్ర కలిగిన  శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజులుగా జరుగుతున్న  జాతర ఉత్సవాలు శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక పూజలతో ముగిసాయి.

ఆలయానికి ఉదయం నుండే భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించి  స్వామివారిని దర్శించుకొని తమ మ్రొక్కుల్ని చెల్లించుకున్నారు.

రాయికల్, మేడిపెల్లి, సారంగాపూర్, మల్లాపూర్, కొరుట్ల, జగిత్యాల ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తుల సమక్షంలో కన్నుల పండువగా రథోత్సవం సాగింది. స్వామివారిని ప్రత్యేకంగా అలకంరించి రథంపై ఆసీనులు చేసి పోటీ పడుతూ భక్తులు ఆలయం చుట్టూ రథాన్ని ఐదుసార్లు త్రిప్పారు.

రథం ముందు దావత్ పూజారుల విన్యాసాలు భక్తులను అలరించాయి. ఆలయ వంశీయులు దేవుని చిన్న రాజం, భీమన్న యూత్ సభ్యులు, మున్నూరుకాపు యూత్ సభ్యులు జాతరలో భక్తులకు ఏలాంటి ఇబ్బందులు తలేత్తకుండా చర్యలు చేపట్టారు. రాయికల్ ఎస్ఐ సుధీర్రావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.