# Tags
#తెలంగాణ

తంగళ్లపల్లి మైనార్టీ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాలయం ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

తంగళ్లపల్లి (సిరిసిల్ల):

నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ప్రతి రోజూ కామన్ డైట్ మెనూ ప్రకారం భోజనాలు పెట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. తంగళ్లపల్లిలోని సిరిసిల్ల మైనార్టీ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని సోమవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్బంగా వంటగదిలోనీ బియ్యం, కూరగాయలు, పండ్లు, కోడి గుడ్లు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ఆర్ఓ ప్లాంట్ పరిశీలించి, స్వయంగా కలెక్టర్ ఆ నీటిని తాగి నాణ్యతను తనిఖీ చేశారు. నాణ్యత ప్రమాణాలు మేరకే ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు, కోడి గుడ్లు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కామన్ మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. పబ్లిక్ పరీక్షల దృష్ట్యా విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టీ నిత్యం చదివించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రిన్సిపాల్ రూసా ఫాతిమాను ఆదేశించారు. ఉత్తమ ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దాలన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *