# Tags
#జాతీయం

ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ నియామకం  

  • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ద్రౌపదిముర్ము 

ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను  ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా సోమవారం నియమితులైనట్లు న్యాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.  ఎన్నికల సంఘం (ఈసీ) సభ్యుల నియామకంపై కొత్త చట్టం ప్రకారం నియమితులైన తొలి సీఈసీ ఆయనే.

గత  2024 సంవత్సరం , మార్చి 15న  న్యూఢిల్లీలోని భారత ఎన్నికల సంఘంలో ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేష్ కుమార్ ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా కేంద్రం నియమించింది.

న్యూ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ సమావేశం తర్వాత జ్ఞానేష్ కుమార్‌ ను ప్రధాన ఎన్నికల కమిషనర్ గా నియమించారు.ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఉత్తర్వులు జారీ చేశారు.

ఆయన పదవీకాలం జనవరి 26, 2029 వరకు కొనసాగుతుంది.

సీఈసీ రాజీవ్ కుమార్ తర్వాత అత్యంత సీనియర్ ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన ఆయన బుధవారం, ఫిబ్రవరి 19, 2025న  పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.

జ్ఞానేష్ కుమార్, కేరళ కేడర్‌కు చెందిన 1988-బ్యాచ్ మాజీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి, జనవరి 31, 2024న యూనియన్ కోఆపరేషన్ సెక్రటరీగా పదవీ విరమణ చేశారు. మార్చి 14, 2024న, ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు.