# Tags
#తెలంగాణ

మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు…మంథని నాయకుల ప్రచారం

మంథని మండలం :

రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు…మంథని మండల పరిధిలోని సూర్యయ్యపల్లె గ్రామంలోని మేరీ మీడియట్రిక్స్ హైస్కూల్ మరియు అలోక్ పబ్లిక్ హైస్కూల్ లలో….

రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ మరియు మంథని నియోజక వర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ ఐత ప్రకాష్ రెడ్డి, తెలంగాణ ఎలక్ట్రిసిటీ మెంబెర్ శేశిభూషణ్ కాచే తదితర కాంగ్రెస్ నాయకులు పర్యటించారు.

మంత్రి శ్రీధర్ బాబు సూచించిన విధంగా నిరుద్యోగులకు, విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీతోనే తగిన న్యాయం జరుగుతుందని వారికి వివరించి, పట్టభద్రుల MLC ఓటును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి వేయాలని కోరారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ఉమ్మడి మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన “ఆల్ఫోర్” డా. వూట్కూరి నరేందర్ రెడ్డి S.L No 2 పై మొదటి ప్రాధాన్యత ఓటు ‘1’ వేసి గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అయిలి ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింగ రావు, జిల్లా కార్యదర్శి కుడుదుల వెంకన్న,మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ అజీమ్ ఖాన్, జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ అరెల్లి కిరణ్ గౌడ్, సూరయ్యపల్లి మాజీ సర్పంచ్ మంథని కర్ణకృష్ణ, ఆర్ల జ్ఞాని, ఆర్ల భానుచందర్ సూరయ్యపల్లి యూత్ కాంగ్రెస్ నాయకులు రావుల నాగేష్, ఆర్ల కార్తీక్, ఆర్ల సాయి కిరణ్, ఆర్ల క్రాంతి పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.