# Tags
#తెలంగాణ #జగిత్యాల

కాంగ్రెస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి,నిరుద్యోగులకు అండగా ఉంటాం…

  • అందరిలో కెల్లా మెరుగైన అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

రాయికల్ : S. Shyamsunder

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నుండే నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ రూపొందించి ఉద్యోగాల భర్తీ చేపట్టిందని విద్యావంతులైన పట్టభద్రులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

గురువారం రాయికల్ పట్టణంలోని వి ఎస్ గార్డెన్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ 2018 శాసనసభ ఎన్నికల్లో మనం ఆశించిన ఫలితాన్ని పొందలేక కొంత నిరాశ చెందాం… ఐనా తర్వాత మీ అందరి సూచనలతో సహకారంతో రాజకీయాలకు అతీతంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందడం జరిగిందన్నారు.

పట్టభద్రులు అంటే మేధావులు ఉద్యోగులు ఉపాధ్యాయులు నిరుద్యోగ యువత అన్నారు.

మేధావులు ప్రాతినిధ్యం వహించే ఎన్నిక పట్టభద్రుల ఎన్నికలన్నారు.సాధారణ ఎన్నికలు అంటే ఆర్థిక భారంతో ముడిపడి ఉంటుంది కానీ మనం ఎలాంటి ఆర్థిక భారం లేకుండా 42 నియోజకవర్గాల్లో మనం ఓట్లు సంపాదించి మొదటి ప్రాధాన్యత క్రమంలో గెలుపొందడం జరిగిందని గుర్తు చేశారు.

నేను 1981వ సంవత్సరంలో ప్రజా జీవితంలోకి అడుగుపెట్టాను..ఆనాటి నుండి ఈనాటి వరకు నాలుగు దశాబ్దాల కాలం నుండి ప్రజా సేవలో ఉంటున్నానని తాను ప్రాణం ఉన్నంతవరకు ప్రజాసేవలో ఉంటాను అన్నారు.

శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలలో ఆశించిన ఫలితం రాకపోవడంతో ఇప్పుడున్న శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలలో పోటీ చేయడం కొంతవరకు వయస్సు, ఆర్థికమైన సమస్యల వలన పోటీ చేయడానికి ధైర్యం చాల లేదని భావోద్వేగానికి గురయ్యారు.

ఉన్న అభ్యర్థుల్లో అందరికంటే మెరుగైన అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సూచించారు.

మెరుగైన,నాణ్యమైన విద్యా బోధన కోసం నరేందర్ రెడ్డి ఫీజు ల దగ్గర కచ్చితంగా ఉండేవారని, గతంలో విద్య కోసం గుంటూరు, నెల్లూరు వైపు వెళ్లే వారిమి బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కూడా గుంటూరు వెళ్లి చదివారని తెలిపారు.

అలాంటి సమయంలో తెలంగాణ ప్రాంత ప్రజలకు నరేందర్ రెడ్డి శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలకు దీటుగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థలను తీసుకొచ్చి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాడని అన్నారు.

మన ప్రత్యర్థి పార్టీ.. బిజెపి పార్టీ. ఆ పార్టీకి కొన్ని సైదాంతిక సిద్ధాంతాలు, మతతత్వ విధానాలు, ఆయన ఓ వ్యాపారవేత్త ,ఒక రియల్టర్, ఆయన ఓ విద్యావంతుడు కాదు విద్యావంతులను తీర్చిదిద్దలేదని విమర్శించారు.

మనమందరం కలిసికట్టుగా పనిచేసి నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరిచి తన గెలుపు కోసం శాయశక్తుల పని చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి, మాజీ సర్పంచులు ఎద్దండి భూమ రెడ్డి,తంగేళ్ల రమేష్,అత్తినేని గంగారెడ్డి,హనుమాన్ ఆలయ చైర్మన్ దాసరి గంగాధర్,నాయకులు కొయ్యేడి మహిపాల్ రెడ్డి,తలారి రాజేష్,ఎద్దండి దివాకర్,బాపురపు నరసయ్య,హరీష్ రావు, గంగారెడ్డి,రాజీవ్,శివ,సంతోష్,సాగర్, జలపతి తదితరులు పాల్గొన్నారు.