# Tags
#తెలంగాణ

రాయికల్ త్రికూటాలయంలో శివరాత్రి వేడుకల ఏర్పాట్లు పూర్తి

రాయికల్ : ఎస్. శ్యాంసుందర్

బుధవారం మహాశివరాత్రిని పురస్కరించుకొని జగిత్యాల నియోజకవర్గం రాయికల్ మండల కేంద్రంలోని ప్రధాన శివాలయం త్రికూటాలయంలో శివరాత్రి వేడుకలకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తిగా గావించారు .

అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తూ, శివుడిని కొలిచే శివరాత్రి ఉత్సవావేడుకల సందర్బంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయంలో అభిషేకాది పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ నిర్వాహకులు రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరించి ఆలయాన్ని ముస్తాబు గావించారు.

మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం నుంచి ఆలయంలోని మహాలింగాన్ని దర్శించుకోవడానికి అభిషేకాది పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు గావించారు.