# Tags
#తెలంగాణ #జగిత్యాల

ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల ఎన్నికల పోలింగ్, 72.5 శాతం పోలింగ్ నమోదు

 రాయికల్: S. Shyamsunder

రాయికల్ పట్టణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం  ప్రశాంతంగా ముగిసింది.

రాయికల్ పట్టణంలో మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా పట్టణంతోపాటు మండల వ్యాప్తంగామొత్తం 2175 పట్ట భద్రుల ఓటర్లకు గాను 1577 మంది వినియోగించుకోగా పురుషులు 951, మహిళలు 626  తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రాయికల్ మండల వ్యాప్తంగా 72.5శాతం పోలింగ్ నమోదు అయింది.   ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఓటర్లు మండల వ్యాప్తంగా 66 మంది గాను 66 మంది ఓటు హక్కు వినియోగిoచి 100 శాతం పోలింగ్ నమోదు అయింది.

మహాశివరాత్రి సందర్భంగా ఉన్నత విద్యల కోసం హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్ళిన పట్టభద్రులు స్థానికంగా ఉండడంతో ఓటర్ శాతం పెరిగింది.ఉదయం 11 గంటల వరకు మందకోడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నం రెండు గంటల వరకు అధిక సంఖ్యలో పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.

పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్సై సుధీర్ రావు బందోబస్తు ఏర్పాటు చేశారు.