# Tags
#తెలంగాణ #జగిత్యాల

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : ఎస్సై సుధీర్ రావు

రాయికల్: S. Shyamsunder

విద్యార్థులు మాదక ద్రవ్యాలకు, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంటేనే చదువులో రాణించవచ్చు అని రాయికల్ ఎస్సై సుదీర్ రావు అన్నారు. పట్టణంలోని విస్డం హై స్కూల్ నూతన భవనంలో ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు కళాబృందం జగిత్యాల వారిచే ఏర్పాటుచేసిన సైబర్ నేరాలు, గంజాయి నిర్మూలన, ట్రాఫిక్ నియమాలు,సామాజిక రుగ్మతలు, మూఢనమ్మకాలు, ఆధునిక చట్టాలపై అవగాహన అనే కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే క్రమశిక్షణ గా ఉంటూ తల్లిదండ్రులు గురువులకు గౌరవం ఇస్తేనే భవిష్యత్తులో ఉన్నత స్థానం పొందవచ్చు అని అన్నారు. అనంతరం హై స్కూల్ విద్యార్థులకు పవర్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ అనే అంశం మీద సీనియర్ సైకాలజిస్ట్ శ్రీహరి తిరునగరి విద్యార్థులకు అవగాహన కలిగించారు. సామాజిక మాధ్యమాలు టీవీ వీడియో గేమ్స్ ల కంట్రోల్ ఉండాలన్నారు. తల్లిదండ్రులు ఇంట్లో బయట మీ పిల్లలను వారి ప్రవర్తనను నిత్యం గమనిస్తూ ఉండాలన్నారు. డిజిటల్ కోచ్ లు విశ్వక్సేన్, అమీర్, ఉదయ్ లు తల్లిదండ్రులకు డిజిటల్ ఎడ్యుకేషన్ పై అవగాహన కలిగించారు. సాఫ్ట్ స్కిల్స్ లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ధృవపత్రాలు ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి, డైరెక్టర్ నివేదిత రెడ్డి, ఇంపాక్ట్ ట్రేైనర్ పావని, హెడ్ కానిస్టేబుల్ లింగమూర్తి, అశోక్ పోలీస్ కళాబృందం ఇంచార్జ్ కమల్ సింగర్ రమేష్ పోషకులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.