# Tags
#జగిత్యాల #Culture #Events #తెలంగాణ

ఇటిక్యాలలో అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

రాయికల్ : ఎస్. శ్యాంసుందర్

రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలోని  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా జరిగింది.

మంగళ వాయిద్యాలతో, భక్తులు గోవిందా! జై శ్రీమన్నారాయణ! అంటూ నామస్మరణ చేస్తుండగా ఆలయ అర్చకులు  జగన్మోహన్చార్యులు, వేద పండితులు మరన్గంటి కళ్యాణ చార్యులు, వేదమంత్రోచ్చారణలతో  స్వామి వారి కళ్యాణం కన్నులపండుగగా నిర్వహించారు. 

కళ్యాణం అనంతరం భక్తులు స్వామి వారికి ఒడిబియ్యం కుడుకలు కనుములు అందజేశారు. తర్వాత స్వామివారిని తులాభారం చేశారు.. ఈ కార్యక్రమంలో  ఆలయ కమిటీ సభ్యులు బోడుగం మల్లారెడ్డి, సురకంటి నాగిరెడ్డి, సామల్ల వేణు, నేముల్ల సాగర్ రెడ్డి, అనుపురం చిన్న లింబాద్రిగౌడ్, రఘునాథ చార్యులు, కనపర్తి శ్రీనివాస్, ఉట్నూరి గంగాధర్, గ్రామ పెద్దలు, యువకులు మహిళలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.