# Tags
#Blog

ముక్కు నేలకు రాసి అసెంబ్లీ స్పీకర్ కు బిఆర్ఎస్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి :ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

దళిత వ్యతిరేక పార్టీ బిఆర్ఎస్…
ముక్కు నేలకు రాసి అసెంబ్లీ స్పీకర్ కు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

(తెలంగాణ రిపోర్టర్):

దళిత వ్యతిరేక పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని, రాష్ట్ర అసెంబ్లీలో అత్యున్నత పదవిలో ఉన్నటువంటి దళిత బిడ్డ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమారును ఉద్దేశించి అహంకారపూరితంగా మాట్లాడిన వ్యాఖ్యలను యావత్ దళిత జాతి తీవ్రంగా ఖండిస్తుందని, అసెంబ్లీ సాక్షిగా ముక్కు నేలకు రాసి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

అసెంబ్లీలో స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వేములవాడ తిప్పాపూర్ తెలంగాణ తల్లి విగ్రహం ముందు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వకుళాభరణం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..