# Tags
#తెలంగాణ

చిగురుమామిడి రైతు సంఘం మండల అధ్యక్షుడిగా కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి..

  • కార్యదర్శిగా గోలి బాపిరెడ్డి..

చిగురుమామిడి: M. Kanakaiah

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల మహాసభను శనివారం నిర్వహించారు.

ఈ మహాసభకు మండలంలోని వివిధ గ్రామాల నుండి రైతు సంఘం నాయకులు హాజరై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

రైతు సంఘం మండల అధ్యక్షులుగా మండలంలోని ఓగులాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి,మండల కార్యదర్శిగా గోలి బాపిరెడ్డితోపాటు కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అనంతరం ఎన్నికైన అధ్యక్ష,కార్యదర్శులు మాట్లాడుతూ… రైతు సమస్యల పట్ల అంకిత భావంతో పనిచేస్తూ, రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని గ్రామ గ్రామాన రైతు సమస్యలను తెలుసుకుంటామని గ్రామ, మండలంలోని రైతు సంఘాన్ని బలోపేతం చేస్తామని వారు చెప్పారు.

తమపై నమ్మకంతో తమను ఎన్నుకున్న రైతులందరికీ,పార్టీ కార్యకర్తలకు నాయకులకు వారు ధన్యవాదాలు తెలియజేశారు.

వీరి ఎన్నిక పట్ల మండలంలోని పలువురు రైతులు హర్షం వ్యక్తం చేశారు.

చిగురుమామిడి రైతు సంఘం మండల అధ్యక్షుడిగా కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి..