# Tags
#తెలంగాణ

జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ ల జోరు .. అసలైన వారు బేజారు ! ఆ దందా కు అడ్డుకట్ట పడేనా?

జయశంకర్ జిల్లా: గుజ్జెటి శ్రీనివాస్

జయశంకర్ జిల్లా పేరు సంచలనాలకు మారు పేరుగా నిలుస్తోందన్న విమర్శలువెల్లువెత్తుతున్నాయి ల్యాండ్, శాండ్, మైన్, వైన్ ఏదైనా సరే జిల్లాకు మరేది సాటి రాదు అన్నంతగా మారుమోగి పోతోంది.

నకిలీ విత్తనాలు, నకిలీ పాసు బుక్కులు, నకిలీ మందులు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీటికి తోడుగా నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం యమ జోరుగా సాగుతోందన్న ఆరోపణలు వినబడుతున్నాయి .

కొంతమంది రెవెన్యూ అధికారుల అండదండలతో అక్రమార్కులు నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు పొంది అసలైన వారి నోళ్లు కొడుతున్నారన్నా విమర్శలు వినవస్తున్నాయి . అన్నింటికీ మూల కారణం రెవెన్యూ శాఖ లోని కొందరు అవినీతి అధికారుల అండ అని అనుకుంటున్నారు.

అయితే ఈ వ్యవహారంలో ఇప్పటికే ఉన్నతాది కారులు విచారణ జరుపు తుండడమే కాకుండా నిఘా వర్గాలు కూడా పూర్తిగా ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా ఇప్పటికైనా నకిలీ వ్యవహారం నిగ్గు తేలి అసలైన అర్హులకు న్యాయం జరుగుతుందో, లేదో వేచి చూడాల్సిందే మరి.