# Tags
#Sport #తెలంగాణ

క్రీడా మైదానాలు ఆధునిక దేవాలయాలు: యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎరవెల్లి విలాస్ రావు

మహాదేవపూర్ : గుజ్జెటి శ్రీనివాస్

క్రీడా మైదానాలు ఆధునిక దేవాలయాలని, ఇక్కడ కుల మత వర్గ బేధాలు ఉండవని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి విలాస్ రావ్ అన్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లామహాదేవపురం మండలం అంబటిపల్లి లో మంగళవారం నాడు మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు స్మారక జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలను, పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు.

ముందుగా శ్రీపాదరావు చిత్ర పటానికి పూలమాలలు వేసి, మౌనం పాటించి, నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా విలాసరావు మాట్లాడుతూ క్రీడలు శారీరక ఉల్లాసానికే కాకుండా మానసిక వికాసానికి కూడా దోహదం చేస్తాయని క్రీడల వల్ల సోదరభావాలు పెంపొందుతాయని అన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని వాటిని క్రీడా స్ఫూర్తితో తీసుకోవాలని అన్నారు.

ఈ క్రీడా పోటీలో సుమారు 40 జట్లు పాల్గొనగా, క్రీడాకారులకు క్రీడా దుస్తులను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజబాబు నాయకులు వామన్ రావు శ్రీనివాస్ రెడ్డి అశోక్ సందీప్ సుగుణ సత్యమ్మ ఎజాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు