# Tags
#తెలంగాణ

ఆకట్టుకున్న చిరుతల రామాయణం ప్రదర్శన..

గొల్లపల్లి మండలం :

దమ్మన్నపేట గ్రామంలో నిర్వహించిన చిరుతల రామాయణం ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది.

గత నాలుగు రోజులుగా గ్రామస్తులు చిరుతల రామాయణం నాటకాన్ని ప్రదర్శించారు. ఈ నెల 9 న ప్రదర్శన ప్రారంభించగా సీతా రాముల కల్యాణం, వాలీ వధ, యుద్ధ కాండ, రావణాసుర వధ, శ్రీ సీతారాముల పట్టాభిషేకం నిర్వహించారు.

రాముడు, సీత, లక్ష్మణుడు, భరత, శత్రజ్ఞుడు, ఆంజనేయుడు, దశరథుడు, రావణాసురుడు పాత్ర దారులుగా బొలిశెట్టి లక్ష్మణ్, మల్లేశం, సోమ తిరుపతి, ముదాం జానారెడ్డి, జంగిలి వంశీ, తూము రాజయ్య, గోండ్ర కొమురెల్లి, బొలిశెట్టి రాజిరెడ్డి వ్యవహరించారు. ఆదివారం శ్రీరాముని పట్టాభిషేకం అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

రామాయణ పాత్రధారులకు ఘన సన్మానం..

ఆదివారం శ్రీరాముని పట్టాభిషేకం సందర్భంగా చిరుతల రామాయణ పాత్రధారులతో పాటు బోధకులు గాండ్ల నర్సయ్యలను రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కందుకూరి కృష్ణారెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాది పాదం తిరుపతి ఘనంగా సన్మానించారు.