# Tags
#తెలంగాణ #ఎడ్యుకేషన్ & కెరీర్

సుంకెట గ్రామంలో పోషణ పక్షోత్సవాలు

మోర్తాడ్ :

మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామంలో ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్షోత్సవాల కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏసి డిపిఓ జ్ఞానేశ్వరి పోషణ పక్షోత్సవాల కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. కిషోర బాలికలు, గర్భిణీలు, పిల్లలలో రక్తహీనత లాంటి జబ్బులను అరికట్టవచ్చని, అందుకోసమే తన ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలింతలకు, గర్భిణీలకు నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించే కార్యక్రమం అమలు చేస్తున్నామని అన్నారు.సకాలంలో ఆహారాన్ని తీసుకోవడం వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన పిల్లలు ఎదుగుతారని అన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు సీమంతాలు, పసిపిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాలు అక్షరాభ్యాసాలు నిర్వహించిన ఐసిడిఎస్ అధికారుల బృందం కిషోర్ బాలికలకు రక్త పరీక్షలు నిర్వహించి రక్తహీనత ఉన్న వారిని గుర్తించి మందులు పంపిణీ చేశారు.

వయసు ప్రకారంగా ఎవరికి ఎలాంటి పోషక ఆహారాన్ని అందించాలో వైద్య బృందం అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్షురాలు దేవగంగు సూపర్వైజర్ మంజుల, అంగన్వాడీ కార్యకర్తలు సుజాత మంజుల స్వప్న గర్భిణీ స్త్రీలు బాలింతలు పాల్గొన్నారు