# Tags

కాళేశ్వరం భూ నిర్వాసితుల కేసులో మంత్రి శ్రీధర్ బాబు పై కేసు కొట్టివేత

  • ఇది ప్రజల, రైతుల విజయం : మంత్రి శ్రీధర్ బాబు

 కాళేశ్వరం భూ నిర్వాసితుల పక్షాన తాము నిలబడ్డామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ కేసు కొట్టివేయడం ఇది ప్రజల, రైతుల విజయమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

హైదరాబాద్:

తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబుకు  నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న కేసును ఇవాళ(శనివారం) నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానం కొట్టి వేసింది.

2017 ఆగస్టు 23వ తేదీన పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో శ్రీధర్ బాబుపై కేసు నమోదైన విషయం తెలిసిందే.

శ్రీధర్ బాబుతో పాటు 300 మంది రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సరైన ఆధారాలు, సాక్ష్యాలు లేకపోవడంతో ఈ కేసును న్యాయస్థానం కొట్టివేసింది.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు….కాళేశ్వరంతో రైతులు నష్టపోతున్నారని, మాకు ప్రజాస్వామ్యం మరియు చట్టం పట్ల గౌరవం ఉంది అని సత్యమేవ జయతే, అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

న్యాయస్థానాలపైన తమకు నమ్మకం ఉందని చెప్పారు. తప్పుడు ఆరోపణలతో పెట్టిన ఈ కేసు ఎప్పటికీ నిలువదని అన్నారు. భూములు కోల్పోయిన రైతుల పక్షాన తాము నిలబడ్డామని అన్నారు.

న్యాయమూర్తి ఈ కేసును కొట్టివేయడం జరిగిందని.. ఇది రైతుల విజయమని అన్నారు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో పోలీసులు అడ్డగోలుగా రైతుల మీద లాఠీఛార్జ్ చేశారని, అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని మంత్రి శ్రీధర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.