# Tags
#అంతర్జాతీయం #People #world #తెలంగాణ

ఏప్రిల్ 30, 2026 వరకు అక్రమ వలస దారులకు మలేషియా ప్రభుత్వం యొక్క వలసదారుల పునరావాస కార్యక్రమం (2.0 )


అక్రమ వలస దారులకు మలేషియా ప్రభుత్వం యొక్క వలసదారుల పునరావాస కార్యక్రమం (2.0 )
2025 అనే కార్యక్రమం ద్వారా ప్రయోజనం దీనికి గడువు ఈ మే నెల 19, 2025- ఏప్రిల్ 30, 2026 వరకు చేపట్టారు.

మలేషియా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ (JIM) వలసదారుల పునరావాస (Repatriation) కార్యక్రమం 2.0 ని ప్రారంభిస్తోంది. ఇది చట్టవిరుద్ధంగా మలేషియాలో నివసిస్తున్న అనధికార వలసదారులు (PATI) కోసం రూపొందించబడిన, స్వచ్ఛందంగా దేశం నుండి నిష్క్రమణ/తిరుగు వెళ్ళే కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా అర్హత కలిగిన వ్యక్తులు, ప్రత్యేక నిబంధనలు మరియు షరతులకు లోబడి, మలేషియాలో న్యాయపరమైన లేదా చట్టపరమైన చర్యలు ఎదుర్కొన కుండా తమ స్వదేశాలకు తిరిగి వెళ్లే అవకాశం కలిగిస్తుంది.

అయితే చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ లేదా పర్మిట్ లేకుండా మలేషియాలో ప్రవేశించడం/ నివసించటం చేసినవారు జరిమానా 500 రింగిట్లు,వీసా గడువుకు కాలానికి మించి ఎక్కువ కాలం నివసించటం (ఓవర్ స్టే) వారు 500 రింగిట్లు మరియు పాస్ పోర్ట్ సంబంధిత నిబంధనలను ఉల్లంఘించడం చేస్తే 300 రింగిట్లు. 20 రింగిట్లు ప్రత్యేక పాస్ జారీ కోసం ఖర్చు (ఈ ఫీజు పిల్లలకు మినహాయించబడింది)(ఈ జరిమానాలు కేవలం స్వచ్ఛందగా దేశం విడిచి వెళ్ళే వారికి మాత్రమే వర్తిస్తాయి).

గతంలో దరఖాస్తు చేసుకొని, నిర్ణీత గడువు లోపు మలేషియాను విడిచిపెట్టని వ్యక్తులు. మరియు బ్లాక్ లిస్ట్ లో ఉన్న వ్యక్తులు లేదా శిక్షా కాలం పూర్తి కాని వ్యక్తులు.మలేషియా పౌరుడి జీవిత భాగస్వాములు. ఈ కేటగిరీకి చెందిన వారు ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందలేరు. వివరాలకు అర్హత కలిగినవారు వీసా కౌంటర్ లేదా సంబంధిత ఇమ్మిగ్రేషన్ కార్యాలయాన్ని సంప్రదించాలి.నమోదు కోసం పోయేవారు చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ లేదా ప్రయాణ పత్రం తప్పనిసరిగా కలిగి ఉండాలి. 14 రోజుల్లోపు ధృవీకరించబడిన తిరుగు ప్రయాణ విమానం టికెట్ ఉండాలి.
వ్యక్తిగతంగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మలేషియా లేదా లాబువాన్ లోని 14 ఇమ్మిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ డివిజన్ కార్యాలయాలలో ఏదైన కార్యాలయాన్ని సందర్శించి దరఖాస్తు సమర్పించాలి.

మరిన్ని వివరాలకు website: www.imi.gov.my లేదా 9491613129 లో సంప్రదించగలరని ఎన్.ఆర్.ఐ. రాష్ట్ర అడ్వైజరీ కమిటి మెంబెర్ స్వదేశ్ పరికిపండ్ల ఒక ప్రకటనలో తెలిపారు.