# Tags
#తెలంగాణ

మంథని పట్టణంలో..యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పెంటరి రాజు ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు

మంథని :

మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు

రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పుట్టిన రోజును పురస్కరించుకొని మంథని పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పెంటరి రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ముఖ్య అతిధిగా ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

అనంతరం మంథని గాంధీ చౌక్ వద్ద కేక్ కటింగ్,చేసి, భారీ బాణాసంచ తో, డీజే చప్పుళ్ళ తో వేడుకలు నిర్వహించారు.

ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ సందర్బంగా మాట్లాడుతూ

రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్స్, శాసనసభా వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

ఈ మంథని నియోజకవర్గం శ్రీధర్ బాబు నాయకత్వంలో మహర్దశను సంతరించుకుందన్నారు . గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, విద్యాసంస్థల స్థాపన, ఆరోగ్య సేవల మెరుగుదల, రైతుల సంక్షేమం కోసం ఆయన చేపట్టిన కార్యక్రమాలు మంథని అభివృద్ధికి చిరునామాగా మార్చాయని కొనియాడారు. పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా మంథని ఆర్ధిక వృద్ధికి బాటలు వేశారు. పెట్టుబడులకు తెలంగాణ కేరాఫ్ గా నిలుస్తోందన్నారు.

తండ్రి చూపిన బాటలో నడుస్తూ, ఆయన ఆశయ సాధనకు నిరంతరం శ్రమిస్తున్నారనీ,మంత్రి శ్రీధర్ బాబు మంథని నియోజక వర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. ఒక వైపు మంత్రిగా విరామం ఎరగకుండా గంటల కొద్ది తెలంగాణ అభ్యున్నతికి కంకణబద్ధులై పని చేస్తున్నారు. మరోవైపు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారికి అంకితమైన నాయకుడిగా గుర్తింపు సాధించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుగుణంగా తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నా శాసనసభ వ్యవహారాలను చక్క దిద్దటంలో దిట్టగా పేరు సంపాదించుకున్నారు. రాష్ట్రంలో ఆయన పేరు తెలియని వారు ఉండరు.

నా రాజకీయ ప్రస్థానంలో నిత్యం నా వెంట ఉండి ప్రజా జీవితంలో కానీ మన లక్ష్యం గెలుపు ఓటములు సహజమని, అంతిమ లక్ష్యం ప్రజలకు సేవ చేయడమే అని, ప్రోత్సహించి ప్రత్యక్షంగా నా గెలుపుకు దగ్గరుండి సహకరించిన మంత్రి శ్రీధర్ బాబు కు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పట్టణ కాంగ్రెస్ నాయకులు, మండల కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, శ్రీధర్ బాబు అభిమానులు తదితరులు పాల్గొన్నారు..