# Tags
#తెలంగాణ #Tech

కేబుల్ టీవీ, ఇంటర్నెట్ స్తంభాల గణన చేపట్టాలి : transco DE గంగారాం

మెట్ పల్లి :

మెట్ పల్లి డివిజన్ వ్యాప్తంగా రెండు మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయితీలు,అన్ని గ్రామాల్లో విద్యుత్ స్తంభాలను నెట్వర్క్ విస్తరణకు వాడే కేబుల్ టీవీ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడర్లు తప్పనిసరిగా పోల్ టాక్స్ చెల్లించాలని మెట్ పల్లి డీఈ గంగారాం కోరారు.

బుధవారం మెట్ పల్లి డివిజన్ లోని కేబుల్ టీవీ ఆపరేటర్లు, ఇంటర్నెట్, బ్రాడ్ బ్యాండ్ ప్రొవైడర్లు, ఆపరేషన్ ఇంజనీర్ల తో సమావేశం నిర్వహించి ప్రతీ స్తంభానికి వివిధ కంపెనీల కేబుల్స్ కట్టి వాడుతున్నందున పట్టణాల్లో స్తంభం ఒక్కంటికి రూ.20, గ్రామాల్లో రూ.15 చెల్లించాలని కోరారు. విద్యుత్ సిబ్బంది, సర్వీసు ప్రొవైడర్లు రీసర్వే నిర్వహించాలని ఆదేశించారు.

ముఖ్యముగా స్తంభాలకు కేబుల్స్ లాగి కట్టడం వలన సిబ్బంది ఎక్కడానికి వీలు కాక ప్రమాదాలు జరుగుతున్నాయ ని, పట్టణ సుందరీకరణ దెబ్బతింటుందని, వీటిని సక్రమంగా ఒక ప్రత్యేక క్లాంప్ బిగించి అందులోనుండి అన్ని వేర్లు లాగాలని, నెల రోజుల్లో పనులు జరగాలని మెట్ పల్లి డీఈ గంగారాం సూచించారు.

ఈ సమావేశంలో ఏడీఈలు మనోహర్, రఘుపతి, ఏఈలు అమరేందర్, రవి, అజయ్, సత్యనారాయణ, శ్యాం, అర్జున్, అశోక్, భూమేశ్వర్, నెట్వర్క్ ప్రొవైడర్లు ప్రవీణ్, మానుకల గంగాధర్, గంగా శ్రీనివాస్, శ్రీధర్, సుభాష్, కాశిరెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.