# Tags
#తెలంగాణ

రాష్ట్ర మంత్రిగా ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్

రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సాధించుకున్న ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్

ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సాధించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 

విద్యార్థి దశలో NSU  నాయకుడిగా ధర్మారం జెడ్పీటీసీ గా రాజకీయ ప్రస్థానం మొదలైన లక్ష్మణ్ కుమార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గా, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగారు.

2009 నూతనంగా ఆవిర్భవించిన ధర్మపురి రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓటమి చెందారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఉప ఎన్నికల్లో  పోటీ చేశారు. 

2014 స్వరాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు. 2018 ఎన్నికల్లో  టిఆర్ఎస్ అభ్యర్థి చీఫ్ విప్  కొప్పుల ఈశ్వర్ ను ఓటమి అంచుల వరకు తీసుకువెళ్లి విజయం సాధించినా, నాటి అధికార ప్రభుత్వ ఒత్తిడికి అధికార యంత్రాంగం సాంకేతిక  తదితర కారణాలు చూపెడితే లక్ష్మణ్ కుమార్ ఓడినట్టు ప్రకటించారు.

అప్పటి క్యాబినెట్ మంత్రి, కొప్పుల ఈశ్వర్ పై 22 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో లక్ష్మణ్ కుమార్ విజయం సాధించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో  ప్రస్తుతం ప్రభుత్వ విప్ గా కొనసాగుతుండగా, ఈ రోజు మంత్రి వర్గ విస్తరణలో  రాష్ట్ర మంత్రిగా అవకాశం పొందారు.