# Tags

సమాజ అభివృద్ధికి మార్గదర్శకులు పాత్రికేయులు : లయన్స్ క్లబ్ గవర్నర్ నడిపెల్లి వెంకటేశ్వరరావు

రాయికల్ : (S.Shyamsunder)

ప్రజలకు ప్రభుత్వానికి స్వచ్ఛంద సంస్థలకు వారధిగా పనిచేస్తు సమాజ అభివృద్ధికి పాత్రికేయులు పాటుపడుతున్నారని లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ గవర్నర్ నడిపెల్లి వెంకటేశ్వరరావు అన్నారు.

రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ (జేఏసీ) కార్యాలయానికి వాటర్ డిస్పెన్సరీని అందించి, పాత్రికేయులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమస్యలను గుర్తించి వార్త రూపంలో క్రోడీకరించి, ప్రభుత్వానికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి మార్గదర్శకులు అవుతున్నారని పాత్రికేయులను కొనియాడారు.

లయన్స్ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను వార్తగా మలిచి ప్రజలకు చేరవేస్తూ మరింత మందిని సేవ చేసేందుకు ప్రోత్సహిస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లయన్ మోర హన్మాండ్లు,లయన్స్ క్లబ్ అధ్యక్షులు మచ్చ శేఖర్,ప్రధాన కార్యదర్శి కడకుంట్ల నరేష్,కోశాధికారి కట్ల నర్సయ్య,మాజీ జడ్ సిలు మ్యాకల రమేష్, బత్తిని భూమయ్య,క్లబ్ సభ్యులు దాసరి గంగాధర్,కొమ్ముల ఆది రెడ్డి,వాసం ప్రసాద్,కొత్తపెళ్లి రంజిత్,బొడ్గం అంజిరెడ్డి,నవీన్,ఏలిగేటి అనిల్,గంట్యాల ప్రవీణ్,బెక్కం తిరుపతి,జిల్లాల సూర్యం రెడ్డి,సాంబారు శ్రీనివాస్,ప్రెస్ క్లబ్ జేఏసీ అధ్యక్షులు వాసవి రవి,ప్రధాన కార్యదర్శి కడకుంట్ల జగన్,పాత్రికేయులు సింగిడి శంకర్,చింతకుంట సాయికుమార్,సురేష్, సింగని శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.