# Tags

వచ్చే నెల 2 నుండి 6 వ తేదీ వరకు హైదరాబాద్ లోని వి.ఎన్.ఆర్. గార్డెన్స్ లోరుద్ర సహిత శతచండీ యాగము

రుద్ర సహిత శతచండీ యాగము కరపత్రం, ఆహ్వానపత్రికను జిల్లా కేంద్రంలో ఆవిష్కరించిన 
వేదపండితులు నంబి వేణుగోపాలచార్యులు

హైదరాబాద్ మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవాసమితి ఆధ్వర్యంలో శ్రీ శారదాచంద్రమౌళీశ్వర రుద్ర సేవాపరిషత్ నిర్వహణలో వచ్చే నెల 2 నుండి 6 వ తేదీ వరకు మల్లాపూర్,హైదరాబాద్ లోని వి.ఎన్.ఆర్. గార్డెన్స్ లోరుద్ర సహిత శతచండీ యాగము నిర్వహిస్తున్నారు.

ఈ సందర్బంగా ఈ  కార్యక్రమంకు సంబంధించిన కరపత్రం, ఆహ్వానపత్రికను జిల్లా కేంద్రంలోని వాసుదేవసదన్ లో గురువారం మధ్యాహ్నం 4 గంటలప్రాంతంలో వేద పండితులు నంబి వేణుగోపాలచార్యులు ఆవిష్కరించారు. 

ఈ కార్యక్రమంలో మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవాసమితి కన్వీనర్ సిరిసిల్ల రామశర్మ, జగిత్యాల సంఘ నాయకులు సిరిసిల్ల శ్రీనివాస్, రాజేంద్రశర్మ,వేణుగోపాల్, చాకుంట వేణుమాధవ్ రావు పాల్గొన్నారు.