# Tags

స్టైపెండ్ ‌సొమ్ము కోసం చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కరీంనగర్ హౌస్ సర్జన్ విద్యార్థుల నిరసన 

కరీంనగర్:

చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కరీంనగర్ యాజమాన్యం మెడికో ఇంటర్న్‌లకు (హౌస్ సర్జన్ విద్యార్థులకు) గత రెండు నెలలుగా స్టైపెండ్ ‌సొమ్ము చెల్లించకపోవడంతో మంగళవారం ఉదయం11 గంటలనుండి అకస్మాతుగా కళాశాల ప్రధాన ద్వారం ముందు బైఠాయించి ఇంటర్న్ వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. అన్ని OPDలు, వార్డువర్క్ మరియు వివిధ వైద్య సేవలను నిలిపి వేశారు.

ఈ మేరకు కళాశాల యాజమాన్యంకు ఒక వినతి పత్రం అందజేశారు. చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇంటర్న్‌లమైన తాము, నిబంధనల ప్రకారం గత 2 నెలలుగా స్టైపెండ్ చెల్లించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నామని తమ లేఖలో పేర్కొన్నారు.

నెలవారీ స్టైపెండ్‌లను చెల్లించకపోవడంతో తాము ఆర్ధికంగాఇబ్బందులు పడుతున్నామని, తమ సమస్యను పరిష్కరించడానికి యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకోవాలని, బకాయి ఉన్న రెండు నెలల స్టైఫెండ్ సొమ్ము వెంటనే చెల్లించాలని కళాశాల 2020 మెడికో ఇంటర్న్‌లు చల్మెడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యాజమాన్యాన్ని కోరారు.

కాగా, హౌస్ సర్జన్ విద్యార్థుల నీరసనను తెలుసుకున్న పోలీస్ లు చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు.కళాశాల యాజమాన్యం కార్యాలయం ప్రతినిధులు మెడికో ఇంటర్న్‌ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

 మెడికో ఇంటర్న్‌లు మరియు యాజమాన్యం మధ్య చర్చల నడుమ స్టైపెండ్‌లను చెల్లింపు సమస్య పరిష్కారమయ్యింది.