# Tags

వేద పండితుల మంత్రోచ్చరణలతో ఘనంగా ప్రారంభమైన రుద్ర సహిత శతచండీ యాగము

హైదరాబాద్:

హైదరాబాద్ మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవాసమితి ఆధ్వర్యంలో శ్రీ శారదాచంద్రమౌళీశ్వర రుద్ర సేవాపరిషత్ నిర్వహణలో బుధవారం మల్లాపూర్,హైదరాబాద్ లోని వి.ఎన్.ఆర్. గార్డెన్స్ లో రుద్ర సహిత శతచండీ యాగమును వేద పండితులు ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఈ  కార్యక్రమంలో హైదరాబాద్ మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవాసమితి కార్యవర్గం,సభ్యులు, వివిధ ప్రాంతాలనుండి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ నెల 6 వరకు రుద్ర సహిత శతచండీ యాగమును వైదికంగా, వేద పండితుల మంత్రోచ్చరణలతో ఘనంగా కొనసాగుతుందని, ప్రతిరోజు పూజా కార్యక్రమం అనంతరం అన్న ప్రసాద వితరణ కూడా కొనసాగుతుందని నిర్వాహకులు వివరించారు.

లోక కళ్యాణంకోసం నిర్వహించే ఈ వైదిక క్రతువులో  ప్రతి ఒక్కరూ పాల్గొని,తరించాలని కోరుతున్నారు.