# Tags

ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు – ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ…

రాజన్న సిరిసిల్ల జిల్లా..(తెలంగాణ రిపోర్టర్, సంపత్ పంజా )

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి తో సహా ఎల్లారెడ్డిపేట మండలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో అద్భుతమైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ ప్రదీప్ కుమార్, రఘు, బాబు పలువురు వైద్యులు వైద్య సేవలు అందిస్తున్న తీరు పట్ల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఎల్లారెడ్డిపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు ఎంబిబిఎస్ డాక్టర్లు, జనరల్ మెడిసిన్ డాక్టర్, పిల్లల వైద్య నిపుణులు, వీరితో పాటుగా నర్సింగ్ ఆఫీసర్ గణనీయమైన సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజలకు అందుబాటులో వైద్యం ఉండాలనే ఉద్దేశంతో ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నారు.

వారికి అనుగుణంగా వైద్యం అందిస్తున్న వైద్యులు. వైద్య సేవలతో పాటుగా అనేక రకాల రక్త పరీక్షలు, ఎలాంటి రుగ్మతలు ఉన్న రోగులకు సేవలందిస్తున్న తీరును డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులను వైద్య బృందాన్ని ప్రజలు కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రజలు అదేవిధంగా ఎల్లారెడ్డిపేటలోని ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు పోయి ఆర్థిక భారము పెంచుకోకుండా ప్రభుత్వ ఆసుపత్రి సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వ వైద్యులు తెలుపుతున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా అనేక సౌకర్యాలను శ్రద్ధ వహిస్తూ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.

అందువలన ప్రజలందరూ ప్రభుత్వ ఆసుపత్రి సేవలను అందుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న సేవలను ప్రభుత్వ ఆసుపత్రిలో కల్పిస్తున్నటువంటి సౌకర్యాలను చూసి రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యమంత్రికి అనుకూలంగా వైద్యులు సైతం వైద్యం అందిస్తున్న తీరు పట్ల అనేక ప్రశంసలు వస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ ప్రభుత్వ సేవలు అందుకోవాలని వైద్యులు కోరుతున్నారు.