# Tags

వ్యవసాయ కూలీలతో కలిసి వరి నాట్లు వేసిన మహిళా ఎస్ ఐ

బెజ్జంకి :

శాంతి భద్రతలే కాదు, వ్యవసాయ రంగంలో సైతం మహిళలు ముందుంటారని పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సౌజన్య చెపుతూ, ప్రత్యక్షంగా వ్యవసాయ క్షేత్రంలో దిగి, మహిళలలతో కలిసి తానూ నాట్లు వేసింది. వివరాల్లోకి వెళితే,


బెజ్జంకి మండలంలోని ముత్తన్నపేట గ్రామంలో వ్యవసాయ కూలీలతో కలిసి ఎస్ ఐ బోయిని సౌజన్య వరి నాటు వేశారు. అనంతరం కూలీలతో మాట్లాడుతూ.. ఇటీవల చైన్ స్నాచింగ్ దొంగతనాలు పెరుగుతున్నాయని, మహిళా కూలీలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

కూలీ పనులకు వెళ్ళినప్పుడు మహిళలు బంగారు ఆభరణాలు ధరించకూడదని, ఒకవేళ ధరించినా ఒంటరిగా వెళ్లొద్దని ఆమె సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనబడితే 100 నెంబర్ కు డయల్ చేసి, పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు