జగిత్యాల:
విద్యార్థులకు సామాజిక అవగాహనతో పాటు విద్య చాలా అవసరమని, తద్వారా వారికి సమాజంలో సంపూర్ణ అవగాహన వస్తుందని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అన్నారు.

“జోష్” పేరుతో నిర్వహింపబడిన జగిత్యాల అల్ఫోర్స్ జూనియర్ కళాశాలల సాంస్కృతిక వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ముందుగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చదువుల తల్లి సరస్వతి మాత విగ్రహానికి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

విద్యార్థులకు సామాజిక స్పృహతో పాటు పలు కళల పట్ల అవగాహన కల్పించాలని మరియు కలల వైభవాన్ని విద్యార్థులకు స్పష్టంగా తెలియజేయడం ద్వారా వారికి అందులో పాల్గొనడానికి ఆసక్తి వస్తుందని చెప్పారు. నేటి పోటీ ప్రపంచంలో ప్రతి విద్యార్థికి సాంస్కృతిక కార్యక్రమాల పట్ల కనీస అవగాహన ఉండడమే కాకుండా వాటిలో పాల్గొనేందుకు ఉత్సాహం ప్రదర్శించి పాల్గొని ఉపశమనం పొందాలని వారు సూచించారు.

సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలను సైతం పరిరక్షించిన వారవుతామని వారు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం అల్ఫోర్స్ విద్యాసంస్థలకే సాధ్యమవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని వారు చెప్పారు.

1991 లో ప్రారంభమైన అల్ఫోర్స్ విద్యాసంస్థలు నేటికీ తరగని ఉత్సాహంతో విద్యార్థులకు రెట్టింపైన నాణ్యతతో విద్యను అందిస్తూ ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసిందని అన్నారు .

ఇటీవల కాలంలో పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీలలో, ఎన్ఐటీలలో ఐఐఐటీలలో, ఎయిమ్స్ లో సీట్లు సాధించిన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు ఘనంగా సన్మానం చేశారు.
కార్యక్రమంలో వార్షిక ప్రణాళికలో భాగంగా అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సైతం ఘనంగా సన్మానించారు
ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.




