# Tags

జగిత్యాల శ్రీ కాసుగంటి నారాయణ రావు డిగ్రీ కళాశాల 60 వసంతాలు పూర్తి-కళాశాల వ్యవస్థాపకుల, తొలి ప్రిన్సిపాల్ కొండలరావు 94వ జన్మదిన వేడుకలు

హైదరాబాద్:

జగిత్యాల శ్రీ కాసుగంటి నారాయణ రావు డిగ్రీ కళాశాల 60 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా కళాశాల అభివృద్ధి కోసం చేయాల్సిన కార్యక్రమాలు,కళాశాల వ్యవస్థాపకులు మరియు తొలి ప్రిన్సిపాల్ కొండలరావు 94వ జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు.

అమీర్ పేట్ ‌లోని సిస్టర్ నివేదిత స్కూల్ ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాశాల పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ వేడుకలలో ప్రభుత్వ ఎకనామిక్ అడ్వైజర్ రాజిరెడ్డి, శ్యామ్మోహన్ రావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ,మాజీ మంత్రులు రాజేశం గౌడ్, సుద్దాల దేవయ్య, కళాశాల భూదాత కాసుగంటి నారాయణ రావు మనుమడు, న్యాయవాది కాసుగంటి లక్ష్మణ్ కుమార్, శాతవాహన యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ వీరారెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఊటూరి రాంకిషన్, రిటైర్డ్అధ్యాపకులు అప్పాల కిషన్ చంద్, మోర హన్మాండ్లు తదితర SKNR పూర్వ విద్యార్థులైన ప్రముఖులతో పాటుగా ప్రస్తుత కళాశాల ప్రిన్సిపాల్ డా ఆశోక్, పూర్వ విద్యార్థులు సిరిసిల్లశ్రీనివాస్, ఎస్పీసుబ్రహ్మణ్యం, సిహెచ్ వి.ప్రభాకర్ రావు మరియు కళాశాల ప్రస్తుత అధ్యాపకులు సాయిమధుకర్, అంకం గోవర్ధన్, రిటైర్డ్ డిఎస్పీ వెంకటేశ్వర్లు, మాజీఎమ్మెల్సీకమలాకర్ రావు తదితరులు పాల్గొని, కళాశాల వ్యవస్థాపకులు మరియు తొలి ప్రిన్సిపాల్ కొండలరావును ఘన సన్మానం నిర్వహించి, విద్యారంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.

ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు, జగిత్యాల డిగ్రీ కళాశాల ప్రారంభమై 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఈ సంస్థను యూనివర్సిటీగా లేదా స్కిల్ ఇండియా సెంటర్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కాలానుగుణంగా విద్యా రంగంలో విద్యార్థులకు మరింత ప్రగతిశీలమైన అవకాశాలు కల్పించే దిశగా ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని వారు అభిప్రాయపడ్డారు.


ఈ సందర్బంగా ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ…
కళాశాల పూర్వ విద్యార్తిగా కళాశాల అభివృద్ధికి తమవంతుగా సహకరిస్తామని, విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేవిధంగా,స్కిల్ సెంటర్ ఏర్పాటుకు ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి విన్నవిస్తామన్నారు
ఈ వేడుకలు ఆనందోత్సాహాలతో సాగిపోయిన వేళ, కొండలరావు గారి జీవితం,వారి సేవలు అందరికీ ప్రేరణగా నిలుస్తున్నాయని పాల్గొన్న ప్రతి ఒక్కరూ భావోద్వేగంతో తెలిపారు.


అలాగే కళాశాల అభివృద్ధికి, 60 వసంతాలను వైభవంగా నిర్వహించడానికి అవసరమైనా అన్ని ఏర్పాట్లను అందరి సహకారంతో చేయడానికి తనవంతుగా పూర్తి స్థాయిలో సహకారం అందించి, జగిత్యాల శ్రీ కాసుగంటి నారాయణ రావు కళాశాల పేరు నిలబెడతామన్నారు.అంతేకాకుండా కళాశాలకు 32 ఎకరాలకు పైగా భూమిని దానం చేసిన శ్రీ కాసుగంటి నారాయణ రావు విగ్రహాన్ని నెలకొల్పాలన్నారు. వారి కుటుంబాన్ని గౌరవించడం కళాశాల విద్యార్థుల బాధ్యత అన్నారు.