# Tags

తల్లిపాలు పిల్లలకు దేవుడిచ్చిన వరంమెట్ పల్లి ఐసీడీఎస్ సీడీపీఓ కే. మనమ్మ

కోరుట్ల, ఆగస్టు 7:

తల్లిపాలు పిల్లలకు దేవుడిచ్చిన వరం లాంటివి అని మెట్ పల్లి ఐసీడీఎస్ సీడీపీఓ కే. మనమ్మ అన్నారు. గురువారం కోరుట్ల పట్టణంలోని మాదాపూర్ కాలనీ అంగన్ వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలలో భాగంగా ముందస్తు రాఖీ పౌర్ణమి పండుగ పర్వదిన వేడుకలు నిర్వహించారు.

ఐసీడీఎస్ సీడీపీఓ కే. మనమ్మ మాట్లాడుతూ….తల్లిపాల యొక్క ప్రాముఖ్యత చాటిచెబుతూ తల్లిపాలు ఇవ్వడం వల్ల పిల్లలు చురుగ్గా, మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని, సమాజంలో ప్రేమానురాగాలతో ఎదుగుతారని, జ్ఞాపకశక్తి పెరుగుతుందన్నారు. తల్లిపాలు బిడ్డకు ఇవ్వడం వల్ల తల్లికి, బిడ్డకు కలిగే లాభాలు, తల్లిపాలు ఇవ్వకపోవడం వల్ల కలిగే నష్టాలు కూడా వివరించారు.

ఆరు నెలలు నిండిన పిల్లలకు అదనపు ఆహారము ఇవ్వడం వల్ల పిల్లలకు జరిగి లాభాలను మెట్ పల్లి ఐసీడీఎస్ సీడీపీఓ కే. మనమ్మ వివరించారు.

ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్ వైజర్ అలవాల భారతి మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు ఇవ్వడం వల్ల తల్లికి, బిడ్డకు ఒక బాండింగ్ పెరుగుతుంది అని తెలిపారు. పిల్లలకు ఇమ్యూనిటీ పవర్ ఐక్యూ ఎక్కువగా తల్లిపాల ముందే లభిస్తాయి పుట్టిన వెంటనే ముర్రిపాలు తప్పకుండా ఇవ్వాలని క్లుప్తంగా వివరించారు. ఆరు నెలల నిండిన పిల్లలకు అన్నప్రాసన చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్ అనసూర్య తదితరులు పాల్గొన్నారు.