# Tags

నియోజకవర్గ అభివృద్ధికోసం ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తా : MLA డా. సంజయ్ కుమార్

జగిత్యాల జిల్లా రాయికల్ : ఎస్. శ్యామసుందర్

నియోజకవర్గ అభివృద్ధికోసంముఖ్యమంత్రితో కలసి రాజకీయాలకు అతీతంగా పనిచేస్తానని జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.

రాయికల్ మండలం సింగారావు పెట్ , కిష్టంపేట గ్రామాలలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

అలాగే సింగారావు పెట్ లో మారంపల్లి మహేష్ కు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి, కిష్టం పెట్ గ్రామంలో గ్రామ సఫాయి మహంకాళిరాజం గంగరాజు కు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి భూమిపూజ చేశారు. 

ఉమ్మడి జిల్లా లో అత్యధిక నిధులు జగిత్యాల కు మంజూరు అయ్యాయని,ఎస్సీ సబ్ ప్లాన్ ఈ జి ఎస్ నిధుల తో అత్యధిక పనులు జగిత్యాల లో జరుగుతున్నాయన్నారు.
స్తానిక సంస్థలలో కాంగ్రెస్ పక్షాన ప్రజలు ఉండాలని, మరింత అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో రవీందర్ రావు, రామచందర్ రావు,జానా గోపి స్వరూప, జాన, సారిక గంగాధర్, గాజర్ల రవి గౌడ్, యం ఏ ముకీద్,భీమయ్య,తిరుపతి గౌడ్ ,సిరిపురంసత్తయ్య ,శంకర్, శేఖర్ రెడ్డి ,బొంతల ఆదిరెడ్డి,సత్తవ్వ, షేకర్,హరికృష్ణ ,చిలుక శ్రీనివాస్, చంద్, నర్సయ్య, సాయి రెడ్డి, దేవయ్య,రామ్ రెడ్డి,జీవన్ రెడ్డి,రాజమౌళి,రాజు,జగన్,వేణు,AE ప్రసాద్,గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కు మహిళలు రాఖీ కట్టారు. కిష్టంపెట్ గ్రామంలో శ్రీ శివ భక్త మార్కండేయ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి శ్రీ జ్ఞాన సరస్వతి మాత దేవాలయం లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా జగిత్యాల పట్టణంలో 4520 డబల్ బెడ్ రూం ఇండ్ల ను నిర్మించామని అన్నారు.రుణ మాఫీ రైతు భరోసా తో రైతుల పక్షపాతి గా తెలంగాణ ప్రభుత్వం ఉందన్నారు.మహాలక్ష్మి ఇందిరా శక్తి మహిళ,గృహ జ్యోతి,సన్న బియ్యం,రేషన్ కార్డులు పంపిణీ తో బీద మధ్యతరగతి ప్రజలు ఆనందంగా ఉంటున్నారని అన్నారు.దశాబ్ద కాలం తర్వాత రేషన్ కార్డుల పంపిణీ తో అందరికీ ఆహార భద్రత,సంక్షేమ పథకాలు అమలు లో ప్రాధాన్యత ఉందన్నారు.ఇందిరమ్మ ఇండ్లతో సొంతింటి కల సాకారం కానుందన్నారు.

ఈ కార్యక్రమంలో రవీందర్ రావు, రామచందర్ రావు,జానా గోపి స్వరూప, జాన, సారిక గంగాధర్,
గాజర్ల రవి గౌడ్, యం ఏ ముకీద్,భీమయ్య,తిరుపతి గౌడ్ ,సిరిపురంసత్తయ్య ,శంకర్, శేఖర్ రెడ్డి ,బొంతల ఆదిరెడ్డి,సత్తవ్వ, షేకర్,హరికృష్ణ ,చిలుక శ్రీనివాస్, చంద్, నర్సయ్య, సాయి రెడ్డి, దేవయ్య,రామ్ రెడ్డి,జీవన్ రెడ్డి,రాజమౌళి,రాజు,జగన్,వేణు,AE ప్రసాద్,గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.